బీర్కూర్ మండలం అన్నారం శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న వాహనాలను రైతు నగర్ లో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సురేందర్ రెడ్డి, పోలీస్ అధికారులతో కలిసి గురువారం సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టి ఒక టిప్పర్, ఒక జేసీబీ జప్తు చేసినట్లు తహశీల్దార్ లత తెలిపారు. జప్తు చేసిన వాహనాలను వాల్టా చట్టం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.