ఓ పాత్రికేయుని పై సర్పంచ్ వీరంగం చేసి దాడికి పాల్పడిన సంఘటన బీర్కూరు మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని చించెల్లి గ్రామానికి చెందిన శ్యామ్సుందర్ స్టూడియో యన్ బాన్సువాడ నియోజకవర్గ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి గతంలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొగ్గుల నారాయణ వద్ద రెండు ఎకరాల 10 గంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన సంబంధిత పట్టాదారు పాసు పుస్తకాలు ధృవపత్రాలు ఉన్నప్పటికీ స్థానిక సర్పంచ్ బాబురావు ఎలాంటి ధృవపత్రాలు లేకపోయినప్పటికీ స్థలం కబ్జా చేయడంతోపాటు, అక్కడ తన సొంత భూమి అంటూ పాత్రికేయుడు అధికారుల సూచన మేరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు.
దీనికి విరుద్ధంగా సర్పంచ్ సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ భూమి తనదని పెట్టాడు. ఇదేంటని సర్పంచ్ ని శ్యాంసుందర్ ప్రశ్నించే క్రమంలో తన అనుచరులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో వెంటనే శ్యామ్సుందర్ పోలీసులను ఆశ్రయించి దాడికి పాల్పడ్డ సర్పంచ్ పై కేసు కేసు పెట్టాడు. అంతేకాకుండా తనకు సర్పంచ్ కుటుంబీకులతో ప్రాణహాని ఉందని పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ భూమి వివాదంపై సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధిత పాత్రికేయానికి న్యాయం చేయడంతోపాటు దాడికి పాల్పడిన సర్పంచ్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని శ్యామ్ సుందర్ డిమాండ్ చేశారు.