బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డివిజన్ అధికారులు, మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను గుర్తించి మరమ్మత్తుల కోసం నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగ గంగాధర్, ఇరిగేషన్ అధికారి గజానంద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.