బాన్సువాడ మండల పరిధిలోని విద్యుత్ అధికారులు ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై తక్షణమే చర్యలు చేపట్టి మరిన్ని సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యుత్ అధికారులు తెలిపారు. పట్టణ గ్రామలలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను సత్వర పరిష్కారం కొరకై ప్రజావాణిని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సంప్రదించాలని, విద్యుత్ అధికారులు తెలిపారు.