వెళ్లి రావమ్మా!! ముగిసిన బతుకమ్మ పండగ

477பார்த்தது
వెళ్లి రావమ్మా!!  ముగిసిన బతుకమ్మ పండగ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో గతతొమ్మిది రోజులుగా ఆడుతున్న బతుకమ్మ పండుగ సోమవారం సద్దుల బతుకమ్మతో ముగిసింది. బతుకమ్మ పండుగకు ప్రతిగ్రామంలో ఆడపడుచులు తంగేడు పూలు, గునకపూలు, రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు పిల్లలు మొదలు కొని వృద్దులవరకు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. సాయంత్రం ఆయగ్రామాల చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

బతకమ్మ పండగ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు:
తెలంగాణా ఏర్పాటు అయ్యాక బతుకమ్మా రాష్ట్ర పండుగగా గుర్తింపుపొందినది. ఈ పండుగను ప్రభుత్వపరంగా నిర్వహించడం జరుగుతుంది. మహిళలలో ఉత్సాహం నింపడానికి ప్రభుత్వము పండుగకు చీరలు పంపిణి చేస్తోంది. బతుకమ్మ ఆడే ప్రదేశాలను స్థానిక గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచుతున్నాయి. బతుకమ్మ ఆడే ప్రదేశం మొదలుకొని బతుకమ్మ నిమజ్జనం చేసే ప్రదేశం వరకు వీధిలైట్లు అమర్చుతున్నారు. బతుకమ్మ నిమజ్జనం చేయడానికి సౌలభ్యంగా ఉండటం కోసం ప్రభుత్వము చెరువుల్లో బతుకమ్మా అంచెలను నిర్మించింది. ఈ విదంగా ప్రభుత్వము బతుకమ్మ పండుగకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే సహజ సిద్ధమైన బతుకమ్మను సాంప్రదాయాన్ని బతికించుకోవలసిన అవసరం మనందరిపైన ఉన్నాడని తెలిపారు .

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி