కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సందర్శించారు. ఈ సందర్భంగా స్టడీ అవర్స్ ను పరిశీలించి విద్యార్థినులకు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.