బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లుల చెక్కులను శనివారం నిజామాబాద్ జిల్లా పరిధిలోని కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాల లబ్ధిదారులకు రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్లో మరియు కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ, నసుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలోని లబ్ధిదారులకు స్థానిక మీనా గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.