కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభించినట్లు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మొగ్లజి తెలిపారు. వితంతువులకు, వికలాంగులకు, 60సం లు పై బడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ గత నెల సొమ్మును అందజేస్తున్నట్లు తెలిపారు. మరోవారం పాటు ఈ పంపిణీ ప్రక్రియ సాగుతుందని పేర్కొన్నారు.