నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి సొసైటీ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం సొసైటీ చైర్మన్ డివిటి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బావయ్య, మాజీ సర్పంచ్ నారా గౌడ్, మాజీ ఎంపిటిసి నారాయణ, అధికారులు నర్సింలు, కవిత, సాయినాథ్, ఏఈఓ సాయి సుమన, డైరెక్టర్లు రాజు, రాములు, గంగారం, గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.