మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అక్టోబర్ 4న బాన్సువాడ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న చిల్డ్రన్స్ పార్క్, మల్టీ జనరేషన్ పార్క్, అంబేద్కర్ భవనం, బాబు జగ్జివన్ రామ్ విగ్రహ ఏర్పాటు పనులను, ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం పనులను, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.