బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం తాడుకోలు చౌరస్తా వద్ద దుకాణదారులు డ్రైనేజీ వదిలేసి తమ వ్యాపారాలు చేసుకోవాలి. డ్రైనేజీలపై నిర్మాణాలు తొలగిస్తాం. డ్రైనేజీ దాటి వచ్చి కబ్జాలకు గురి చేస్తే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటామని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పట్టణంలో ఉన్న దుకాన్దారులందరికీ తెలియజేశారు. డ్రైనేజీ దాటి వచ్చి వ్యాపారస్తులు ఎవరైనా కబ్జా చేస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.