బాన్సువాడలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు tsparamed. tsche. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ బై పి సి చేసిన వారు, ఒకేషనల్ కోర్సు చేసిన వారు తప్పకుండా బ్రిడ్జి కోర్స్ చేసి ఉండాలని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా సలహా కోసం కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.