కడప అమ్మాయికి అమెరికాలో రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం

1912பார்த்தது
కడప అమ్మాయికి అమెరికాలో రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం
ఏపీలోని కడప అమ్మాయి ఎర్రనాగుల అమృతవల్లి జాక్‌పాట్ కొట్టింది. వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో ఉన్న అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. అమృతవల్లి దుర్గాపూర్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఎంఎస్ చేసింది. అది పూర్తిచేసిన నెల రోజులకే అమెజాన్‌లో ఉద్యోగం రావడం గమనార్హం.

தொடர்புடைய செய்தி