కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కోరుట్ల మున్సిపల్ సమావేశంలో సోమవారం ఏర్పాటు చేసిన ఎజెండాలో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులను కాంగ్రెస్ వార్డులకు మాత్రమే కేటాయించడాన్ని తప్పు పట్టారు. జనరల్ ఫండ్ నిధులు కోరుట్ల ప్రజల హక్కు అని దాన్ని అన్ని వార్డులకు సమానంగా కేటాయించకుండా బి ఆర్ ఎస్ బిజేపి ఎంఐఎం కౌన్సిలర్ లకు సంబందించిన వార్డులపై వివక్షత చూపుతూ వారి వార్డులో నిధులు కేటాయించక పోవడంపై విచారాన్ని వ్యక్తపరిచారు.