మొగిలిపేటకు చెందిన డండ్ల శ్రీనివాస్ గత కొద్దీ రోజుల క్రితం దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గల్ఫ్ బోర్డు ద్వారా దండ్ల శ్రీనివాస్ భార్య అనితకు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అధికారులను కలిసి, కలెక్టర్, ఆర్డీఓలను చెప్పడంతో మంగళవారం దాని ద్వారా 5 లక్షల రూపాయలను వారి అకౌంట్ లో వేయించడం జరిగింది.