జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఏల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజింగ్ వారు నిర్వహిస్తున్న ఐదు రోజుల పాటు జరిగే ఉగాది సంబరాలు, పురస్కారాలు కార్యక్రమంలో మంగళవారం రాత్రి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం నుండి ఒగ్గు డోలు కళాకారుల నృత్యాలతో ఉరేగింపుగా మైదానంకు మంత్రి కొప్పుల తో పాటు కళాకారులతో వచ్చి మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమదు లు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ కళలను బ్రతికించే ప్రయత్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి మిమిక్రి అలరించాయి. అదే విదంగా జిల్లా, నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏల్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజింగ్ చైర్మన్ కొప్పుల స్నేహాలత, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వివిధ మండలాల జడ్పీటిసిలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు.