జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. మంత్రి దంపతులకు ఆలయ పక్షాన ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సతీమణి స్నేహాలత, కూతురు నందిని, అల్లుడు అనిల్ లతో కలిసి ప్రధాన ఆలయంతో పాటు అన్ని అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు.