జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానమునకు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) తిరుకోవెల వినోద్ కుమార్ సందర్శించారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగా స్వాగతంపలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించారు. కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేషవస్త్ర ప్రసాదం చిత్రపటం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు నంబి నరసింహ మూర్తి, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ, మున్సిపల్ కమిషనర్ రమేష్, దేవస్థానం రెనవేషన్ కమిటీ సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్ పాల్గొన్నారు.