ఏపీ రాష్ట్ర కేబినెట్‌లో జనసేన నేత నాగబాబు చేరిక ఖరారైంది. త్వరలో ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా, జనసేన సేత నాగబాబు ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోకి జడ్జీలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వేర్వేరు ప్రభుత్వాల్లో ఇద్దరూ రాజకీయాల్లో అవకాశం దక్కించుకున్నారు. అప్పట్లో నాగబాబు, రోజా మధ్య మంచి సంబంధాలే ఉండేవి. కానీ రాజకీయంగా విబేధాలు తలెత్తాయి.