గోంగూరను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లతోపాటు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. దాన్ని తీసుకోవడం వల్ల రేచీకటి, మధుమేహం, కంటి సమస్యలు దూరమవుతాయి. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అందుకే గోంగూర పచ్చడి, గోంగూర రైస్, గోంగూర పప్పు వంటివి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.