దబిర్పురా డివిజన్ పరిధిలో యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ శనివారం పర్యటించారు. పలు కాలనీలలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్యలను అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే స్థానికంగా కొనసాగుతున్న అభివృద్ది పనులపై అరా తీశారు. గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూస్తామన్నారు.