తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రయోగాత్మక అమలు కొరకు పైలట్ ప్రాజెక్టు కింద వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని కుడుగుంట గ్రామం ఎంపిక చేశారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల్ అధ్యక్షుడు సురేష్, సీనియర్ నాయకుడు రాములు యాదవ్, గ్రామస్థులు నాయకులు పాల్గొన్నారు.