ఓయూ: సస్పెండ్ చేసిన కానిస్టేబుల్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
ప్రభుత్వం విధుల నుండి డిస్మిస్ చేసిన 10 మంది ప్రత్యేక పోలీసులు, సస్పెండ్ చేసిన 37 మంది టిజిఎస్పీ కానిస్టేబుల్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఓయూలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. పాత పద్ధతులను వదిలేసి కొత్త పద్ధతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చి వాళ్లందరికి న్యాయం చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.