ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీ 29వ వైస్ ఛాన్సలర్ గా ప్రో.కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అయన పరిపాలన భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఓయూ అధ్యాపకులు, అధికారులతో సెనేట్ హాల్లో సమావేశమయ్యారు. విశ్వ విద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.