బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీ లాబీలో కేటీఆర్, బాల్క సుమన్ లతో 30 నిమిషాల పాటు సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. గత కొంతకాలంగా మంత్రి పదవిపై వివేక్ వెంకటస్వామి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం తక్కువగా ఉండడంతో ప్రచారం జరుగుతోంది.