నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై బతుకమ్మలతో మంత్రి సీతక్క భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, కాంగ్రెస్ నాయకురాలు కాలవ సుజాత, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.