ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ఇక నమ్మేది లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. పార్శిగుట్ట ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ. వర్గీకరణ చట్టం తమ చేతికి వచ్చేవరకు ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 16న వరంగల్లో జరిగే ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ సంస్థల జాతీయ రాష్ట్ర జిల్లా మండల కమిటీల మీటింగ్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.