బేగంపేట పరిధిలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ రహదారి డంపింగ్ కేంద్రంగా మారుతుంది. గురువారం పరిసర ప్రాంతాల ప్రజలు ట్రాన్స్ ఫార్మర్ పక్కనే రోడ్డు పై వ్యర్ధాలను పడేసి వెళ్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సరైన సమయానికి తొలగించక పోవడంతో, వ్యర్థాలు పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఇకనైనా దీనిపై తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.