నిప్పంటించుకుని ఓ 98 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య కు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గాంధీనగర్ సిద్ధంశెట్టి అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో సరోజినీ (98) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఓవైపు వృద్ధాప్యం, మరోవైపు తాను ఎవరికీ భారం కావద్దనే ఆలోచనతో వృద్ధురాలు తన చీరకు నిప్పంటించుకుని తనువు చాలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.