కుమ్మరిగూడలోని గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి శనివారం స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ పర్యటించారు. రానున్న సద్దుల బతుకమ్మ ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. ఈసారి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇతర ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.