నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బేగంపేటలోని ఎయిర్లైన్స్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కాలనీ సమస్యలు పరిష్కరించినందుకు ఎమ్మెల్యేను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.