రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో పద్మశాలి పురం సమీపంలో స్మశాన వాటికకు మౌలిక వసతులు లేక పలు ఇబ్బందులు పడుతున్నారు. స్మశాన వాటిక వద్ద దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేయడానికి నీటి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో డ్రమ్ముల ద్వారా నీటినీ ఉపయోగించుకుంటున్నారు.స్మశాన వాటిక ముళ్ళ చెట్లలతో చాలా అద్వానంగా మారిందన్నారు.