కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగద్గిరిగుట్టలోని అంజయ్య నగర్ కి చెందిన శ్రీనివాస్ మామిడి గత కొన్నిరోజులుగా కుడి చేతికి గాయం అయి సర్జరీ కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆర్ధిక స్థోమత లేదని తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం 50, 000 సీఎం సహాయనిధి నుండి సోమవారం మంజూరు చేయించాడు.