జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనిలో నైట్ డ్యూటి చేస్తున్న వ్యక్తి ఎప్పటిలాగే రాత్రి షిఫ్ట్ లో పనికి వెళ్ళాడు. పని చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలి కిందపడిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.