జన్వాడ పామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందనే వార్తలపై ఎమ్మెల్యే కేపి వివేకానంద ఆదివారం స్పందించారు. దీనికి సంభందించిన ఫైర్ ను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇళ్ళు కూల్చితే మాట్లాడని, రైతులకు రుణమాఫి. రైతుబందు వేయకపోతే అడగని బండి సంజయ్ ఓ ప్రైవేట్ పార్టీకి సంభందించిన సమాచారం కావాలని అడుగుతున్నారు. ఇదంతా రేవంత్, సంజయ్ కుట్ర. బండి సంజయ్ కేంద్రానికి కాకుండా రేవంత్ కు సహాయమంత్రి గా పని చేస్తున్నారన్నారు.