కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండారి లేఔట్ నందు గల శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా ఇంట్లోని పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడకుండా కాపాడు తల్లి అంటూ అమ్మవారిని కొలుస్తారన్నారు.