సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. ఆదివారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో గౌళిగూడ కు చెందిన లబ్దిదారుడికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నీది చెక్కును ఎమ్మెల్సీ అందజేశారు. రూ. లక్ష విలువైన చెక్కును అందజేసినట్లు తెలిపారు. అర్హులైన వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటే త్వరగా చెక్కులు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు.