కుల మతాంతర వివాహాలు రాజ్యాంగబద్ధమేనని ప్రభుత్వం, పౌర సమాజం అభ్యుదయ వివాహాలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ అధ్యక్షత వహించారు.