మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టారు. వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు అన్ని పరీక్ష ఫలితాలు ఆపివేయాలని, మిగతా నోటిఫికేషన్ కూడా విడుదల చేయకూడదని అలా చేస్తే మాదిగలు మాదిగ ఉపకులాలు నష్టపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని, వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని నిరసన దీక్ష చేపట్టారు.