బీసీ బిల్లు కిందిస్థాయి వాళ్లకు కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ తల్లి మరణించడంతో మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో ఉంటున్న వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించి ఓదార్చినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు మూడు విడివిడిగా బిల్లులు పెట్టాలన్నారు.