మేడ్చల్ నియోజకవర్గం పూడూర్ గ్రామంలో 4. 70 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనంను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని చెప్పారు.