మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 102, 108, వాహనాలను అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేసారు. ఇందులో భాగంగా ఈఎంఈ విజేందర్, మేడ్చల్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పీఎం జాన్స్ హిద్ వాహనాల రికార్డులను, మందులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం డ్రైవర్లు సకాలంలో వస్తున్నారా లేదా అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.