హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనలు ప్రజలకు తెలియాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ చర్యలు తీసుకోవడం లేదని, రేవ్ పార్టీల్లో వీఐపీల పిల్లలున్నారన్న వార్తలపై కాంగ్రెస్, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని కోరారు.