మల్కాజిగిరి డివిజన్ పరిధి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను బుధవారం కార్పొరేటర్ శ్రవణ్ సందర్శించారు. పాఠశాల ఆవరణలో రాత్రిపూట ఆకతాయిలు మందు సేవించి బాటిల్స్ పడేస్తున్నారని, దీంతో బాలికలకు ఉదయం ఇబ్బందిగా మారుతోందని కార్పొరేటర్ దృష్టికి టీచర్లు తెచ్చారు. స్థానికంగా సీసీ రోడ్లు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను త్వరలో చేపడుతామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. దీనికోసం రూ. 7 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు.