విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం మల్కాజ్ గిరి నియోజకవర్గం చౌరస్తాలో తిరుమల లడ్డు అపవిత్రతపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్, విహెచ్పి నాయకులు మాట్లాడుతూ, భారతదేశాన్ని హిందూ దేశంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, హిందూ ధర్మంపై జరుగుతున్న అరాచకాలను కేంద్ర ప్రభుత్వం అరికట్టి, తిరుమల లడ్డు అపవిత్రత చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.