రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిపై దాడులు జరిగిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. కాప్రా మండల తహశీల్దార్ సుచరిత ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సర్వే నెంబర్ 427, 428, 645, 655 లలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లారు. దీంతో కట్టడాలను కూల్చవద్దని అడ్డుపడి సిబ్బంది పై దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని తహశీల్దార్ సుచరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.