తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 21 వరకు పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది.