బాలాపూర్ మండలంలో బీజేపీ నాయకులు జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆదివారం బడంగ్ పేట కార్పొరేషన్లోని బాలాపూర్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్ రెడ్డి ఆన్ లైన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా చేపట్టారు. బీజేపీ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ దేశానికి రక్ష అన్నారు. ప్రతీ ఒక్కరు బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు.