ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని బోయిన్ చెరువును మంగళవారం ఎమ్మెల్యే మాధవరం సందర్శించారు. ఈ సందర్భంగా హరిజన బస్తికి చెందిన పేద ప్రజలు తమ నివాసాలను కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని చెరువుల పూర్తి సమగ్ర సమాచారాన్ని తనకు అధికారులు అందజేయాలని ఆదేశించారు.