కూకట్ పల్లి నియోజకవర్గం బేగంపేట అంబేద్కర్ నగర్ లో కమ్యూనిటి హాల్ ను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. స్థానికులు ఈ కమ్యూనిటి హాల్ ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం డివిజన్ లో మిగిలిన పనులు (డ్రైనేజీ, మంచినీటి లైన్స్ పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతం చేయాలని జెడ్సిని కోరారు. నిధులు కావలసిన పనులకు అంచనాలు తయారు చేసి అందిచాలని అధికారులకు తెలిపారు.